బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం భట్టిప్రోలు లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను మంగళవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భట్టిప్రోలు మండల పరిధిలోని జువ్వలపాలెం నుండి ఇసుక తరలిస్తున్న డాక్టర్ను వేమూరు సిఐ కె. వెంకటేశ్వరరావు వెల్లటూరు వద్ద ఆపి వివరాలు అడిగారు, ట్రాక్టర్ లోని ఇసుకకు సంబంధించి ఎటువంటి టోకెన్లు లేకపోవడంతో ట్రాక్టర్ భట్టిప్రోలు పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వైస్ సురేష్ తెలిపారు.