రానున్న నాలుగు రోజుల్లో జిల్లాలో తేలిక పాటి వర్షాలు కురిసే సూచన ఉందని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవ రెడ్డి, ఆశోక్ కుమార్ చెప్పారు. ముఖ్యంగా 17, 18, 19 తేదీల్లో వర్షాలు కురుస్తాయన్నారు. రబీ పంటలు నూర్పిడి చేసే రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే ఐదు రోజుల జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 351 నుంచి 37. 9 సెల్సియస్ డిగ్రీలుగా, రాత్రి ఉష్ణోగ్రతలు 19. 8 నుంచి 21 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఆగ్నేయం దిశగా గాలులు 8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ఉదయం పూట గాలిలో తేమ 78 శాతం, మధ్యాహ్నం పూట 40 శాతం ఉంటుందన్నారు.