నన్ను తిట్టేందుకు అయిదు మంది మంత్రులకు 40 నిమిషాలు సమయం ఇచ్చిన సభాపతి, నా సమస్యలు వినడానికి 5 నిముషాలు సమయం ఇవ్వలేకపోయాడు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు. గాంధీగిరిలో నిరసన చేస్తే, సస్పెండ్ చేసి... మార్షల్స్‌తో బయటకి పంపించారన్నారు. తానేం చేశానని అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారో ఆలోచించాలన్నారు. రాజకీయానికి అతీతంగా నియోజకవర్గ సమస్యని పరిష్కరించమని అడిగానని తెలిపారు. వంతెనల నిర్మాణం కోసం ఈనెల 30 లోపు టెండర్లు పిలవకుంటే వచ్చే నెల 6వ తేదీన పొట్టేపాలెం కలుజు వద్ద జలదీక్ష చేస్తానని ప్రకటించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నీళ్ళల్లో కూర్చోనున్నట్లు తెలిపారు. ప్రజాసమస్యల కోసం ఖచ్చితంగా ప్రశ్నిస్తానని.. మాట తప్పును.. మడెమ తిప్పను అని స్పష్టం చేశారు.