స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్4 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం ప్రభుత్వం వై.ఎస్.ఆర్ ఆసరా పథకం క్రింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించామని ఏపీ సర్కార్ వెెల్లడించింది. ఇదిలావుంటే ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని 78.74 లక్షల స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు మూడు విడతలుగా రూ.19,137 కోట్లు తిరిగి చెల్లించారని తెలిపారు. వై.ఎస్.ఆర్. ఆసరా పథకం 4వ విడత కోసం రూ.6,700 కోట్లు కేటాయింపును ప్రతిపాదించారు.
అలాగే సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి రూ. 3 లక్షల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది అన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన. దీనికి గాను 2019 సంవత్సరం నుంచి గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్లమంది మహిళలకు.. 3,615 కోట్ల రూపాయలు చెల్లించామన్నారు. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది అన్నారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించారు.
అలాగే ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో రూ.75,000 ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ మొత్తాన్ని లబ్టిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 26. 7 లక్షల మంది మహిళా సభ్యులకు మూడు విడతలుగా రూ.14,129 కోట్లు అందజేశామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయలకేటాయింపును ప్రతిపాదించారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్ధిదారులు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతోందన్నారు మంత్రి. 2023-24 ఆర్టిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధికి మార్గాలు కల్పించడం కోసం.. ప్రభుత్వం 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు సంవత్సరానికి రూ.15,000 అందజేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వై.ఎస్.ఆర్. ఈ.బి.సి. నేస్తం
అలాగే దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలలో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి జూలై 1, 2021 న వై.ఎస్.ఆర్. బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1.21 కోట్ల మంది ఈ పథకం క్రింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వై.ఎస్.ఆర్. బీమా కోసం రూ.372 కోట్లు కేటాయింపును ప్రతిపాదించారు.