విశాఖలో ఈనెల 19 జరిగే భారత్ ఆస్ట్రేలియా రెండో వన్డేకు వర్షం ఆటంకంకలిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కోస్తాంధ్ర వ్యాప్తంగా గురువారం వర్షాలు కురుస్తున్నాయి. 18న భారీ వర్షం పడే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ, ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ వరకు మరొకటి ద్రోణులతో అకాల వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. గంటకు 40 నుంచి 50 కి. మీ. ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో విశాఖలో జరిగే డే అండ్ నైట్ మ్యాచ్‌పై వర్షం ప్రభావం స్పష్టంగా ఉంటుందని అనుమానాలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉంది. దీంతో భారీగా టికెట్లు అమ్ముడైన ఈ మ్యాచ్‌పై అటు బీసీసీఐ. ఇటు అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. వరుణుడు కరుణించాలని, మ్యాచ్ సజావుగా జరగాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు.