తాజాగా ఒడిశా నుంచి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని.. పోలీసులు పట్టుకున్నారు. అల్లూరి జిల్లా చింతపల్లి పోలీసులు.. గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ తుహీన్ సిన్హా, చింతపల్లి ఏఎస్పీ కేపీఎస్ కిశోర్ వెల్లడించారు. ఒడిశా నుంచి ఇతర రాష్ట్రాలకు చింతపల్లి మీదుగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయి స్మగ్లింగ్గురించి పోలీసులకు సమాచారం అందడంతో.. చింతపల్లి ఎస్ఐ అరుణ్ కిరణ్ తనిఖీలు నిర్వహించారు. చింతపల్లి మండలం పెంటపాడు జాతీయ రహదారిపై వాహనాలను తనిఖీ చేస్తుండగా.. ఓ వాహనంలోని ముగ్గురు వ్యక్తులు వెంటనే దిగి పోరిపోవడం గమనించారు. పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకున్నారు. వారు వదిలి వెళ్లిపోతున్న వాహనం తనిఖీ చేయగా.. వాహనంలో బియ్యం బస్తాలు మాటున భారీ మొత్తంలో రవాణా చేస్తున్న గంజాయి దొరికింది. లభించిన గంజాయి 1700 కేజీలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
ఈ 1700 కేజీల గంజాయిని ఒడిశాకు చెందిన సీతారాం అనే వ్యక్తి.. అతని స్నేహితుడు కలసి మహారాష్ట్రకు చెందిన గంజాయి వ్యాపారులకు సరఫరా చేస్తున్నట్లు.. పోలీసులకు పట్టుబడ్డ వాహనం డ్రైవర్ పోలీసులకు వివరించారు. వీరితో పాటు గంజాయిని సరఫరా చేస్తున్న సీతారాం కూడా ఇదే వాహనంలో ప్రయాణిస్తున్నాడు. వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎస్ఐ అరుణ్ కిరణ్, సీఐ రమేష్ను.. జిల్లా ఎస్పీ అభినందించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా