ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల బీపీ, గుండెపోటు, పక్షవాతం వంటి రుగ్మతలు వచ్చే అవకాశం అధికమని, మరణాలు సంభవించే స్థితి అధికమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. ఉప్పు తక్కువగా వినియోగిస్తే ప్రపంచంలో 2030 నాటికి 7 మిలియన్ల మంది ప్రాణాలు రక్షించవచ్చని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఉప్పు వినియోగం తగ్గేలా ప్రభుత్వాలు, వైద్య సంస్థలు ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొంది.