గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని చిరు వ్యాపారులతో కాంట్రాక్టర్లు గెజిట్ ప్రకారమే సుంకం వసూలు చేయాలని సిఐటియు అనుబంధ తోపుడు బండ్లు యూనియన్ నాయకులు తిమ్మప్ప కోరారు. శుక్రవారం ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోడ్లకు ఇరువైపులా వ్యాపారం చేసుకునే చిన్న వ్యాపార స్తుల, తోపుడు బండ్లు వ్యాపారులు సుంకం చెల్లించే టెండర్లకు మున్సి పల్ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారన్నారు. ఐతే ఆ షెడ్యూల్లో టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ గెజిట్ ప్రకారమే సుంకం రుసుములు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో కొంత మంది టెండర్లు వేసిన తర్వాత అధిక సుంకం వసూలు చేస్తూ చిరు వ్యాపారులపై భారాలు వేశారన్నారు. కావున అలాంటి ఘటనలు పునరా వృత్వం కాకుండా అధికారులు చూడాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోపుడుబండ్లు యూనియన్ నాయకులు రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.