ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బత్తలపల్లి నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను పొట్లమర్రి వద్ద బొలెరో వాహనం ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఓ చిన్నారితో పాటు మరో ఇద్దరు ధర్మవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa