పెద్దలకు 5 గంటల నిద్ర సరిపోతుందనేది అపోహ మాత్రమేనని, ఇది నిజమని నమ్మి చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. తగినంతగా నిద్రపోకపోతే గుండె సమస్యలు, డిప్రెషన్, హైపర్ టెన్షన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఏ వయసు వారైనా రాత్రిపూట 7 నుంచి 9 గంటల పాటు నిద్రపోవాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచిస్తోంది.