ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు కొత్తూరు తాడేపల్లికి చెందిన భీమవరపు సామిరెడ్డి దంపతులు శుక్రవారం 52 గ్రాముల బంగారు లక్ష్మీకాసుల హారం, జేవీడీవీ ప్రసాదరెడ్డి 25 గ్రాముల బంగారు కాసుల నెక్లెస్ను కానుకగా సమర్పించారు. ఈ వో భ్రమరాంబ ద్వారా దేవస్థానానికి ఆభరణాలను అం దజేశారు. అమ్మవారి దర్శనమయ్యాక దాతలకు ప్రసాదం, శేషవస్త్రం, ఆశీస్సులను పండితులు అందించారు.