రేపల్లె అంగన్వాడిలాకు ప్రభుత్వం ఇచ్చినా హామీలు అమలుకై 20తేదినా చలో విజయవాడకి తరలిరావాలని అంగన్వాడి వర్కర్స్&హెల్పర్స్ యూనియన్ బాపట్ల జిల్లా అద్యక్షరాలులు కె. జాన్సీ పిలుపు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ సీఐటీయూ 20 తేదీ విజయవాడ ధర్నా పిలుపు నేపద్యంలో శనివారం రేపల్లె ప్రాజెక్టు సీడిపిఓ మాణిక్యంకి వినతిపత్రం సమర్పించారు, ఆనంతరం జాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడి వర్కర్స్ కు ఇచ్చినా హామీ మేరకు తెలంగాణ కన్న అదనంగా వేతనాలు అమలుచేయాలని కొరుతు విజయవాడలో జరిగే ధర్నాలో బాపట్ల జిల్లా పరిదిలో వర్కర్ మరియు హెల్పర్స్ అందరు పాల్గొనాలని అన్నారు.
ప్రభుత్వము అంగన్వాడి వర్కర్స్ కు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్న నెరవేర్చలేదు. రోజువారీ ధరలు పెద్ద ఎత్తున పెరుగుతున్నవి, తెలంగాణలో 2021 నుంచి 13600 వేతనం అమలవుతున్న ఇక్కడ 2019లో ఇస్తున్నా వేతనాలు అమలుచేస్తు అంగన్వాడిలా బాధలు పట్టిచుకోవటం లేదని అన్నారు, అంగన్వాడీలకు గ్రాట్యుటి అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అమలుకు బిల్లులు సక్రమంగా చెల్లించడం లేదు, అంగన్వాడీలు అప్పు చేసి సెంటర్లు నడపాల్సిన పరిస్థితి వచ్చింది, రకరకాల యాప్ ల ను తీసుకొని వచ్చి పని భారాన్ని పెంచారుని అన్నారు. ఈ సందర్బంగా *సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్. మణిలాల్ మాట్లాడుతు* అంగన్వాడీలకు ఇచ్చినా సెల్ ఫోన్లు పనిచేయడం లేదు, సెంటర్లను బలోపేతం చేయడానికి నిధులను పెంచి అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అంగన్వాడీలు మానసిక ఒత్తిడికి గురై అనారోగ్య పాలవుతున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి అంగన్వాడి వర్కర్స్ అమలు కావడం లేదు, అంగన్వాడీలకు ఫేస్ యాప్ రద్దు చేయాలి, పర్యవేక్షణ పేరుతో వేధింపులు ఆపాలి, వైయస్సార్ సంపూర్ణ పోషణ మెను చార్జీలు పెంచాలని , గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, 2017 సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న టీఏ లను వెంటనే చెల్లించాలి, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారం అందించాలి, ఆయిల్ కందిపప్పు క్వాంటిటీ పెంచాలి, వేతనంతో కూడిన మెడికల్ లీవులు ఇవ్వాలి, సర్వీస్ లో ఉండి చనిపోయిన కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, రాజకీయ వేధింపులు లేకుండా చూడాలి తదితర డిమాండ్స్ సాధన కై మార్చి 20నా విజయవాడలో జరిగే మహా ధర్నాకు అందరు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పార్స్ యూనియన్ నాయకుల పాల్గొన్నారు.