మైనారిటీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, సబ్ ప్లాన్ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్‌లో కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని , మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మొదటి నుంచి మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని అలానే ఇవాళ ప్రభుత్వం 45 నెలల కాలంలో రూ.21,756.69 కోట్లు మైనారిటీ సంక్షేమం కోసం ఖర్చు చేశారు. డీబీటీ కింద రూ.11,188 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.10,568 కోట్లు వైయస్ జగన్ ఖర్చు చేశారని వివరించారు.