పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయాన్ని ప్రకటించడానికి కూడా ప్రభుత్వానికి ఇష్టం లేదు అన్నటుగా ప్రవర్తించారు అని టీడీపీ నాయకులూ వాపోతున్నారు. రాయలసీమ తూర్పు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో 34,108 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత 50 శాతం +1 ఓటుతో 1,24,181 ఓట్లు సాధించారు. శ్రీకాంత్‌కు ఆ ఓట్లు వచ్చే సమయానికి వైసీపీ అభ్యర్థి శ్యాం ప్రసాద్ రెడ్డికి 90,071 ఓట్లు వచ్చాయి. దీంతో 34,110 మెజారిటీతో టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ గెలుపొందారు. అయితే ఫలితాలు ప్రకటించడంలో అధికారులు జాప్యం చేశారు. కౌంటింగ్ సెంటర్‌లో టీడీపీ అభ్యర్థి ఉన్నా ఫలితం ప్రకటించకుండా అధికారులు వెళ్లిపోయారు. రాత్రి నుంచి డిక్లరేషన్ ఇవ్వకుండా కాలయాపన చేశారు. చివరకు ఈసీ ఆదేశంతో శ్రీకాంత్ గెలుపును అధికారులు ధృవీకరించారు అని టీడీపీ నాయకులూ తెలియజేసారు.