ఆంధ్రప్రదేశ్ లో జరిగిన పట్టభద్రుల, శాసన మండలి ఎన్నికల ఫలితాలే జగన్ ప్రభుత్వం పై వున్న వ్యతిరేకతకు, సమర్థుడైన చంద్రబాబుపై గల అనుకూలతకు నిదర్శనమని, ఇది 2024 ఎన్నికలకు ప్రీ ఫైనల్ ఫలితాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా అన్నారు. శనివారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుచూ 9 ఉమ్మడి జిల్లాలలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం, ఉత్తరంధ్ర ప్రాంతాలలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాలలో 14 లక్షల పట్టభద్రుల ఓట్లకు జరిగిన శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైన విజయాన్ని అందిస్తూ, చంద్రబాబుకు మద్దతు పలికారని, జగన్ అసమర్ధ పాలనకు వ్యతిరేకంగా పట్టభద్రులు తీర్పు నిచ్చారన్నారు.
స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో తెలుగుదేశం పోటీ చేయని కారణంగా, వైసీపీ, దౌర్జన్యంగా గెలిచిన ఫలితాలతో నేడు 4 ఎమ్మెల్సీ లు గెలుపొందారని, పోటీ లేని గెలుపు గెలుపేనా అని ప్రశ్నించారు. 2 టీచర్ ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికలలో వైసీపీ గెలవటం విచిత్రంగా ఉందని, ఒక ప్రక్క ప్రభుత్వం తమపట్ల అనుచిత వైఖరి అవలంభించి, తమ సమస్యలను పరిష్కరించకుండా, సమస్యలకు గురి చేస్తున్నదని చెబుతున్న టీచర్స్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయడం టీచర్స్ ద్వంద వైఖరికి నిదర్శనమని సాయిబాబా తప్పు పట్టారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పట్ల రోజు రోజుకు ప్రజలలో వ్యతిరేకత పెరిగిపోతున్నదని, ఇదే జగన్ కు చివరి అవకాశమని ఆయన అన్నారు.
రానున్న రోజుల్లో ఈ ప్రజా వ్యతిరేకత మరింత పెరిగి 2024లో జగన్ కుప్పకూలటం ఖాయమని సాయిబాబా జోస్యం చెప్పారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు కుక్కల వెంకటేశ్వరరావు, శొంఠి సుబ్బారావు, నాగయ్య చౌదరి, వేములపల్లి శివకుమార్, రాఘవరావు, వేములపల్లి కమలాకరరావు, వీరాంజనేయులు, జల్లి సుబ్బారావు, నక్కా శ్రీనివాసరావు, బొర్రా గాంధీ, వాకా శ్రీనివాసరావు, రాయన ప్రసాదరావు, వేజల్ల సతీష్, నాగబాబు, వాకా శేషుబాబు, మాచర్ల నాగరాజు, దీపాల శివప్రసాద్, జొన్నదుల వెంకటేశ్వరరావు, సయ్యద్ అబ్దుల్ కలాం, కొన్నిపాటి లోకానంద్, కంభం సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa