ఆస్ట్రేలియాలో విషాదం చోటుచేసుకుంది. న్యూసౌత్ వేల్స్ ప్రాంతంలోని డార్లింగ్ నదిలో లక్షలాది చేపలు అకస్మాత్తుగా మృత్యువాత పడ్డాయి. వాతావరణంలో పెరిగిన వేడి కారణంగా నీటిలో ఆక్సిజన్ సరిపోకపోవడంతోనే ఇలా జరిగిందని అధికారులు చెబుతున్నారు. కాగా, నది నిండా చేపలు చనిపోయిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. చేపలను తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.