న్యూఢిల్లీ-అజ్మీర్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తనిఖీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శతాబ్దిలో అందుతోన్న సౌకర్యాలు, సేవల గురించి ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. ట్రాక్‌లో మార్పులు చేయడం ద్వారా రైళ్ల వేగాన్ని పెంచనున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీ-జైపూర్ మధ్య వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత రైల్వే మంత్రిపై ప్రశంసలు.. అత్యాధునికమైన వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టినందుకు పలువురు ప్రయాణికులు అశ్విని వైష్ణవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. రైళ్లను మరింత అత్యాధునికంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారు. రైళ్లల్లో మహిళలకు భద్రతను మరింత మెరుగుపర్చాల్సి ఉంటుందని, నైట్ పెట్రోలింగ్ పెంచాలని చెప్పారు. రైళ్లను సమయానుగుణంగా నడిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు: మంచి జీతం, వెంటనే అప్లై చేయండి 24 సర్వీసులు.. ప్రస్తుతం దేశంలో 24 రాజధాని ఎక్స్ ప్రెస్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 1969-70 రైల్వే బడ్జెట్ లో తొలిసారిగా దీన్ని ప్రకటించారు. తొలి రైలు ఢిల్లీ-హౌరా మధ్య అందుబాటులోకి తీసుకొచ్చారు. 1969 మార్చి 1న మొదటి రాజధాని ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ నుంచి హౌరాకు మధ్య రాకపోకలు సాగించింది. ఏపీ, తెలంగాణ సహా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఉత్తరాఖండ్, హర్యానా, పంజాబ్ మధ్య 24 సర్వీసులు రాకపోకలు సాగిస్తోన్నాయి. 1988లో శతాబ్ది ఎక్స్ ప్రెస్ పట్టాలెక్కింది. 21 సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి.