అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. బుధవారం జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో అమెరికాలో కనీస వడ్డీ రేట్లు 4.5-4.75% నుంచి 4.75-5%నికి చేరాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం వరుసగా తొమ్మిదోసారి. 2007 అక్టోబరు తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. ఈ ప్రభావం అక్కడి స్టాక్‌మార్కెట్లపై ప్రభావం చూపగా, మన మార్కెట్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.