భారత కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ఆదివారం మధ్యాహ్నం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శిక్షణలో ఉండగా కూలిపోయింది.ముగ్గురు ట్రైనీ పైలట్‌లతో వెళ్తున్న అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్) ధ్రువ్ రన్‌వే వెనుక భాగంలో కూలిపోయింది.ఒక ట్రైనీ పైలట్‌కు గాయాలు కాగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. దీని తరువాత విమానాశ్రయ కార్యకలాపాలు రెండు గంటలపాటు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. దెబ్బతిన్న హెలికాప్టర్‌ను మధ్యాహ్నం 2 గంటల సమయంలో రన్‌వే నుంచి తొలగించారు. భద్రతా తనిఖీ తర్వాత విమానాల సేవలను పునఃప్రారంభించారు.న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన తొలి విమానం ఏఐ 831 మధ్యాహ్నం 2.28 గంటలకు విమానాశ్రయంలో దిగింది. గతంలో ఒమన్ నుంచి తిరువనంతపురం వెళ్లాల్సిన విమానాన్ని తిరిగి కొచ్చికి మళ్లించారు.