సిమెంట్ ట్రక్కు ఢీకొని ఓ బైకర్ మృతి చెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ లో ఆదివారం జరిగింది. సిమెంట్ ట్రక్కును రాంగ్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేసేందుకు బైకర్ ప్రయత్నించాడు. దీంతో అతను ట్రక్కు వెనుక చక్రం కింద పడిపోయి చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.