చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ పెట్ర పావెల్ ఎన్నికయ్యారు. రెండోసారి జరిగిన ఓటింగ్‌లో బిలియనీర్ ఆండ్రెజ్ బాబిస్‌ను ఓడించాడు. పావెల్‌కు 58.2 శాతం, బబీస్‌కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. పావెల్, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా, పావెల్ గతంలో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO) మిలిటరీ కమిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశారు.