విద్యార్థులకు ఇది పరీక్ష సమయం. ఈ సమయంలో ఏకాగ్రత అవసరం. కొంతమంది పిల్లలు ఏకాగ్రత లేక సతమతమవుతుంటారు. ఇందుకోసం సంతులిత ఆహారం తినాలి. టైంకి మంచి భోజనం చేయాలి. ఫుడ్ స్కిప్ చేయకూడదు. ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేయటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. నీరు ఎక్కువగా తీసుకుంటే శరీరం హైడ్రేట్ అయి మెదడు చురుగ్గా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్, కెఫిన్ వంటి వాటికి దూరంగా ఉండాలి.