ఏపీ ఇంటర్ బోర్డ్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా సోమవారం సెకండ్ ఇయర్ భౌతిక శాస్త్రం పరీక్ష జరిగింది. ఇందులో ఇంగ్లీష్ మీడియం పేపర్‌లో అయస్కాంతానికి సంబంధించిన ఓ ప్రశ్న తప్పుగా ప్రింట్ అయింది. దీనిపై స్పందించిన ఇంటర్మీడియట్ బోర్డు ఆ పరీక్షలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు 2 మార్కులు కల్పనున్నట్లు ప్రకటన చేసింది. ఆ ప్రశ్నకు జవాబు రాసినా, రాయకపోయినా మార్కులు కలపాలని నిర్ణయించింది.