కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ యువ నాయకుడు ఉన్నo మారుతి చౌదరిని మంగళవారం అర్థరాత్రి అనంతపురంలో ఆయన నివాసంలో పోలీసులు అరెస్ట్ విషయం విధితమే. అయితే బుధవారం ఉదయం విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. రైతుల మోటర్లు కూడా మంత్రికి తక్కువ వచ్చాయని మండిపడ్డారు. రైతుల మోటర్లు దొంగలించడం నేరమ్మన్నారు. రైతులకు చెందాల్సిన మోటర్లను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం తో వాహనాన్ని వెంబడించి పట్టుకొనేందుకు వెళ్తే తప్పుడు కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూన్నారని అయన అన్నారు. ఎన్ని కేసులు పెట్టిన రైతుల పక్షాన పోరాడుతామని హెచ్చరించారు. రైతులకు సబ్సిడీతో అందించే వ్యవసాయ పంపుసెట్లను అధికార పార్టీ వ్యక్తులు అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మోటర్లు రైతులకు అందరికి అందే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.