తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో, గుడివాడలోని ఓ గౌడన్లో మంటలు చెలరేగాయి. ఏలూరు రోడ్లోని శారీ పెయింటింగ్ ఆయిల్స్, బిస్కెట్ బాక్సుల నిల్వలు ఉన్న గోడౌన్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు ఐదు లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. అయితే గోడౌన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.