ఏపీలో ఏప్రిల్ 3 నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమవ్వనున్న విషయం తెలిసిందే. ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ సారి కూడా నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. 8.45 నుండి 9.30 వరకు లోపలికి అనుమతిస్తామని, 9.30 దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి డిజిటల్ పరికరాలు నిషేధించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa