దారిద్ర్య రేఖకు దిగువన వున్న వారికి అందిస్తున్న 'ఆయుష్మాన్ భారత్' హెల్త్ కార్డు పథకానికి ఆన్లైన్ చేసుకోవడానికి గడువు తేదీ ఈ నెల 31 తో ముగుస్తున్నందున, గడువు తేదీని పెంచాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి. యాకూబ్ పాషా బుధవారం ప్రభుత్వాన్ని కోరారు. ఈ పథకం పట్ల ప్రజలకు అవగాహన లేని కారణంగా భద్రాద్రి జిల్లాలో 60 శాతం మంది పేదలు తమ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేసుకోలేదని అన్నారు.