పేద ప్రజల సంక్షేమ పార్టీ, బడుగు బలహీన వర్గాల గుండెచప్పుడు, తెలుగింటి ఆడపడుచుల ఆశాజ్యోతి, ఆంధ్రుల ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ అని 2, 3 వార్డుల కార్పొరేటర్లు గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా అప్పలకొండలు అన్నారు. తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా భీమిలి జోన్ 3వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జనరల్ సెక్రటరీ గొలగాని నరేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా భీమిలి చిన్న బజార్ జంక్షన్లో ఉన్న అన్న నందమూరి తారక రామారావు నిలువెత్తు విగ్రహానికి గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా అప్పలకొండ, గొలగాని నరేంద్ర కుమార్ లు సంయుక్తంగా పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పార్టీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేసి, కేక్ కట్ చేయడమైనది. ఈ సందర్బంగా ఇరువురు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి అసంఘీత శక్తిగా తెలుగు వారు ఎదుగుటకు కారణమైందని అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని రాజకీయ చైతన్యం విస్తృతం కావడానికి నాడు తెలుగుదేశం పార్టీ వేసిన బీజమని అన్నారు. ప్రజా శ్రేయస్సుతో అడుగులు వేసే పార్టీ తెలుగుదేశం అని, అందుకే ప్రతీ తెలుగువారి గుండెల్లో చిరస్తాయిగా పార్టీ సిద్దాంతాలు ఇమిడి ఉంటాయని ఆశాబావం వ్యక్తం చేసారు.
ఈ కార్యక్రమంలో 3వ వార్డు ప్రధాన కార్యదర్శి గొలగాని నరేంద్ర కుమార్, 4వ వార్డు అధ్యక్షులు పాసి నర్సింగరావు, నాయకులు కాసరపు నాగరాజు, పెంటపల్లి యోగీశ్వరరావు, కనకల అప్పలనాయుడు, చోడిపల్లి సాయి, కొక్కిరి అప్పన్న, కంచెర్ల కామేష్, నరసింహులు, జోగ సన్యాసిరావు, పైడిపల్లి నర్సింగరావు, గండిబోయిన పోలిరాజు, రిక్క సత్య, నూకరత్నం, మంగమ్మ, జలగడుగుల మురళి, పిల్లా తాతారావు, వియ్యపు పోతురాజు, వాడమొదలు రాంబాబు, శ్రీనివాసరావు, శంకర్, దేవుళ్ళు, పూతి రవికుమార్, చిల్ల గోపిరెడ్డి, కందుల సుందర్ రావు, లక్ష్మణరావు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.