హిరమండలం మండల కేంద్రంలో ఆసరా వరుసగా మూడవ ఏడాది నమూనా చెక్కును పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి పంపిణీ చేశారు. బుధవారం తిరుమలలో మండల కేంద్రంలో ఆసరా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మండలంలోని చుట్టుప్రక్కల గ్రామాలకు సంబంధించిన మహిళలు కార్యక్రమానికి భారీ ఎత్తున విచ్చేశారు. పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి శాంతి మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకు పెద్దపీట వేస్తూ అండగా ఉన్నారని, ఇటువంటి ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలు మునుపెన్నడు చూడలేదని అన్నారు. కార్యక్రమంలో మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.