వంటల్లో కొత్తిమీరను కేవలం రుచి, వాసన కోసమే అనుకుంటారు. అయితే, రోజూ కొత్తిమీర తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పొట్ట సమస్యలు, శరీరంలో వైరస్, బ్యాక్టీరియాలు నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంచి ఆకలి కలిగేలా చేస్తుంది. రక్తహీనతతో బాధ పడే వారికి కొత్తిమీర ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం కొత్తిమీర జ్యూస్ తాగితే నోటి దుర్వాసన నుంచి కాపాడుకోవచ్చంటున్నారు.