సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీది ఘనమైన చరిత్ర అని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 41 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా మంగళగిరి పట్టణంలోని ఎం. ఎస్. ఎస్ భవన్ లో పట్టణ, రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలను నిర్వహించారు. తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారకరామారావు, మాజీ మంత్రి ఎం. ఎస్. ఎస్ కోటేశ్వరరావు విగ్రహాలకు నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్ లో ఉన్న ఎన్టీఆర్, ఎం. ఎస్. ఎస్ కోటేశ్వరరావుల విగ్రహాలకు నివాళులర్పించారు.
41 వసంతాల వసంతాలు పూర్తి సందర్భంగా స్వీట్స్ పంపిణీ చేసి వేడుకలను కార్యకర్తలు నడుమ ఘనంగా నిర్వహించారు. అనంతరం పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, రూరల్ మండల అధ్యక్షులు తోట పార్థసారధిలు మాట్లాడుతూ టీడీపీ పార్టీ నేటికి 41 వసంతాలు పూర్తి చేసుకొని 42వ వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. పేదల జీవితాలకు పెన్నిధిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి వినూత్న పథకాలెన్నో ప్రవేశపెట్టినట్లు తెలిపారు.
కార్యక్రమంలో టిడిపి నాయకులు తమ్మిశెట్టి జానకి దేవి, గోవాడ దుర్గారావు, షేక్ రియాజ్, మల్లవరపు వెంకట్రావు, కాండ్రు శ్రీనివాసరావు, ఆకుల జయ సత్య, వింజమూరి ఆశా బాల, ఊట్ల శ్రీమన్నారాయణ, మున్నంగి శివ శేషగిరిరావు, గాదే పిచ్చిరెడ్డి, తిరువీధుల వేమూరి మైనర్ బాబు, పందేటి తిరుపతయ్య, ఆరుద్ర భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.