కాకినాడ జిల్లా కోరింగ పంచాయతీ పరిధి హోప్‌ఐలాండ్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణ, ఉత్పత్తి కేంద్రాన్ని ఫారెస్టు పీసీసీఎఫ్ వై.మధుసూదనరెడ్డి గురువారం సందర్శించారు. 400 ఆలీవ్‌రిడ్లీ తాబేళ్ల పిల్లలను సముద్రంలోకి వదిలారు. అనంతరం కోరింగ ఫారెస్టు కాంప్లెక్స్ నందు రినోవేషన్ చేసిన 3 హట్స్, గెస్ట్‌హౌస్ ను ప్రారంభించారు. కోరింగ అభయారణ్యం ఎకో టూరిజాన్ని ఆయన సందర్శించారు. కార్యక్రమంలో సీసీఎఫ్ ఎస్.శ్రీ శరవాణన్, జిల్లా అటవీశాఖాధికారి ఐకేవీ రాజు, కోరింగ రేంజర్ ఎస్‌ఎ్‌సఆర్ వరప్రసాద్, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.