ఢిల్లీలో దోమల నివారణకు వెలిగించిన మస్కిటో కాయిల్ ఆరుగురి ప్రాణాలు బలితీసుకుంది. ఓ కుటుంబం గురువారం రాత్రి మస్కిటో కాయిల్‌ను అంటించి పడుకుంది. రాత్రి వేళ కాయిల్ పరుపుపై పడి పొగ అలుముకుంది. మంటలు చెలరేగిన అనంతరం వెలువడిన విషపూరిత వాయువులను పీల్చడంతో ఊపిరాడక ఆ కుటుంబంలోని ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa