చిలీలో భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ చిలీ తీరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కి.మీ లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని తెలిపింది. కాగా, ఈ నెల 23న కూడా చిలీలో భూకంపం సంభవించింది. ఇక్విక్ లో 6.3 తీవ్రతతో భూమి కంపించింది. వరుస భూకంపాలతో చిలీ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.