ఏపీలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారో తమకు తెలుసునని మంత్రి మెరుగు నాగార్జున కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.... అందుకే వారిని పార్టీ నుంచి బహిష్కరించామన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే చెప్పాలన్నారు. సీఎం జగన్ దయవల్లే శ్రీదేవి ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆమెకు వైసీపీ సానుభూతి పారులు వెహికల్ కూడా ఇచ్చారన్నారు. ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటడంతో వెహికల్ తీసుకున్నారని.. ఇందులో దౌర్జన్యం ఏమీ లేదన్నారు.