ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. భారత్‌లో కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అధికారులు శంషాబాద్ విమానాశ్రయంలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించారు. ఇందుకోసం థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి వంద మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో అనుమానం ఉన్న ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలున్న ప్రయాణికులు విధిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలని అధికారులు సూచించారు.