పరిపాలనాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని నలుగురు తహశీల్ధార్లను బదిలీ చేస్తూజిల్లా కలెక్టర్ ఎ. మల్లికార్జున ఉత్తర్వులు జారీ చేశారు. ఖాళీగా ఉన్న పద్మనాభం తహశీల్ధార్ పోస్టులో సీసీఎల కార్యాలయం నుంచి వచ్చిన టి శ్రీవల్లిని నియమించారు. కలెక్టరేట్ డీ- హెచ్ విభాగాల పర్యవేక్షకులు ఎం పాలికిరణు గాజువాక తహశీల్ధార్ ర్గా నియమించారు. డీ-హెచ్ విభాగబాధ్యతలను కలెక్టరేట్ పరిపాలన అధికారి కేవీ ఈశ్వరరావుకు అప్పగించారు. ల్యాండ్ రిఫార్మ్స్ (భూ సంస్కరణలు) విభాగ పర్యవేక్షకులుగా కొనసాగుతున్న వి. సుజాతను కలెక్టరేట్ సీ, ఎఫ్ విభాగాల పర్యవేక్ష కులుగా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa