ప్రభుత్వ అధికారి లంచం అడిగాడని ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది. మహారాష్ట్రలో ఓ రైతు తన వ్యవసాయ పొలంలో బావి తవ్వేందుకు ప్రభుత్వ అధికారుల అనుమతి కోరాడు. కాగా, ఓ అధికారి రైతును రూ. 2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని రైతు తమ గ్రామపెద్దకు చెప్పడంతో, గ్రామ పెద్ద ఆగ్రహంతో రూ.2 లక్షలను ప్రభుత్వ కార్యాలయంలో వెదజల్లుతూ నిరసన వ్యక్తం చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa