భద్రాచలం శ్రీసీతారామ చంద్ర స్వామి వారి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు సాగాయి. భజనలు కీర్తనలతో ఆలయ పరిసరాలు రామనామంతో మారుమోగాయి. ప్రధానాలయంలో సుప్రభాతం, నామార్చనలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో వేద పారాయణం సాగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రివేళ ఊంజల్ సేవను రమణీయంగా కొనసాగించారు. బేడా మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో స్వామివారిని ఉంచి పూజలు చేశారు. ఆవాహన పూజలు నిర్వహించి ఉపచార కీర్తనలు ఆలపించారు. కల్యాణం వేడుక అనంతరం నిర్వహించే సంబరాలలో ఇది అతి ముఖ్యమైన ఉత్సవమని పండితులు పేర్కొన్నారు.