ఇటీవల కాలంలో కార్లలో సాంకేతిక సమస్య తలెత్తి అగ్నిప్రమాదాలకు గురవుతున్న ఘటనలు తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో బయటికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ లో అడిషనల్ అగ్రికల్చర్ డైరెక్టర్ కు చెందిన కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ఉన్న నలుగురు వెంటనే దిగిపోయి ప్రాణాలను కాపాడుకున్నారు. మంటలు వ్యాపించి కారు క్షణాల్లోనో కాలిబూడిదైపోయింది.
![]() |
![]() |