విజయనగరం జిల్లా, బొండపల్లి మండలం, ఒంపల్లి గ్రామం ఒకప్పుడు అభివృద్ధిలో వెనుకబడి ఉండేది. అయితే స్థానిక మహిళా సర్పంచ్ లండ నారాయణమ్మ. గ్రామాభివృద్దికి పాటుపడుతోంది. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చే విధంగా గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తోంది. గ్రామస్తుల సహకారంతో గ్రామంలోని సమస్యలను పరిష్కరించుకుంటు, ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో తాగునీటి కుళాయిలు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించుకొని గ్రామాన్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. గతంలో డెంగీ, మలేరియా వంటి రోగాల బారినపడ్డ ప్రజలు. మూడేళ్లుగా అలాంటి రోగాలు లేకపోవడంతో హాయిగా జీవిస్తున్నారు.
గ్రామంలో అర్హులైన ప్రతీ ఒక్కరికి సంక్షేమ పధకాలు అందించేందుకు గ్రామ సర్పంచ్ లండ నారాయణమ్మ చేసిన కృషి మరువలేనిది. ఇప్పుడు ఆ పల్లెలో మార్పులు గతానికి, ఇప్పటికీ పోల్చుకుంటే మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక చిన్న పల్లె గా ఉన్న ఒంపల్లి గ్రామం ప్రభుత్వ సహకారం గ్రామ సర్పంచ్ కృషితో నేడు పక్కా భవనాల నిర్మాణాలతోపాటు, విద్యకు పెద్దపీట వేస్తూ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, ఎలిమెంటరీ పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో అనేకమార్పులు తీసుకువచ్చారు. పాఠశాలలలో డిజిటల్ తెరలు ఏర్పాటు చేసివిద్యాబోధన చేస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం హరిత రాయబారులు ఇంటింటికీ తిరిగి తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి, చెత్త నుండి సంపద కేంద్రాలకు తరలించి, సేంద్రియ ఎరువులను తయారు చేస్తున్నారు.
అదే విధంగా గ్రామంలో 40లక్షల వ్యయంతో గ్రామ సచివాలయ భవనం, 20లక్షల వ్యయంతో రైతు భరోసా కేంద్రం, స్మశాన వాటికలో నిర్మాణాలు చేపట్టడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా కొబ్బరి మొక్కలు నాటి, వాటి ద్వారా గ్రామానికి ఆదాయం తీసి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ సుంకరి భారతి, ఎంపీటీసీ లండ సత్యనారాయణ, వీఆర్వో బి ప్రసాద్, తదితర గ్రామ నాయకులు పాల్గొన్నారు.