శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సుప్రభాతంతో కైంకర్యాలు శయనోత్సవముతో ప్రారంభమయ్యాయి. ఉదయం బాలభోగం స్వామి వారి అభిషేకము చేశారు. ఉదయం ఏడు గంటలకు దర్శనాలు ప్రారంభమైనాయి. ఉదయం నారసింహ హెూమం, నిత్య కళ్యాణం అనంతరం 12 గంటలకి స్వామివారి నివేదన అనగా ఆరగింపు అనంతరం 1 గంటలకి దర్శనాలు ప్రారంభం అవుతాయి. సాయంత్రం వేళ స్వామి అమ్మవారి జోడు సేవ రాత్రి 7 గంటల 30 నిమిషము లకు స్వామివారి అమ్మవారికి సహస్రనామార్చన రాత్రి 8: 15 నిమిషములకు దర్శనాలు ప్రారంభం రాత్రి 9 గంటలకు స్వామివారికి ఆరగింపు అనగా నివేదన రాత్రి 9 గంటల 45 నిమిషములకు ద్వారబంధనం చేస్తారు.