గుంటూరు నెహ్రూ నగర్ కి చెందిన కవితకు గురువారం ఫేస్ బుక్ లో ఇంటి నుంచి ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదించుకునే పోస్టింగ్ వచ్చింది. దాని వివరాలు తెలుసుకోవడానికి ఆధార్ లింక్ ను క్లిక్ చేశారు. అందులో పేరు ఆధార్, పాస్పోర్ట్ ఫోటోలతో పాటు బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు చేయాలని అడగటంతో వాటన్నిటిని భర్తీ చేశారు. అనంతరం కొద్దిసేపటికి తన బ్యాంకు ఖాతా నుంచి రూ. 1. 70 లక్ష్యాలు డ్రా చేసినట్లు ఆమె సెల్ కు మెసేజ్ వచ్చింది.