గుంటూరు: తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి మధ్య నూతనంగా ప్రారంభిస్తున్న వందే భారత్ రైలు గుంటూరు మీదగా వారానికి ఆరు రోజులు నడుస్తుందని మండల రైల్వే అధికారి రామకృష్ణ తెలిపారు. ఈనెల 8వ తేదీన సికింద్రాబాద్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైలు ప్రారంభిస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్లో ఉదయం 11: 30 గంటలకు బయలుదేరి గుంటూరు మీదగా తిరుపతికి రాత్రి 9: 00 గంటలకు చేరుకుంటుందన్నారు