విశాఖ జీవీఎంసీ కమిషనర్ పి. రాజాబాబుకు పదోన్నతి లభించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గురువారం రాత్రి చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి బదిలీ, పదోన్నతి ఉత్వర్వులను విడుదల చేశారు. రాష్ట్ట్యవాప్తంగా 57 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీలు, పదోన్నతులు కల్పించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, జీ20 సదస్సు విజయవంతంలో కమిషనర్ రాజాబాబు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. ఈ మేరకు ప్రభుత్వం గుర్తించి పదోన్నతి కల్పించినట్టు అంతా భావిస్తున్నారు.