వంకాయను సాధారణంగా కూరల్లోకి ఉపయోగిస్తాం. కానీ, వంకాయతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయని నిపుణులు సూచిస్తున్నారు. వంకాయల్లో ఫైబర్, నీరు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో జీర్ణాశయం వాపు, మలబద్ధకం లాంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. వంకాయల్లో ఆంథో సయనిన్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. వీటిలో సాపోనిన్ అనబడే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. అందువల్ల అధిక బరువు తగ్గుతారు. వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. వీటిలో ఉండే సోలాసోడైన్ రమ్నోసైల్ గ్లైకోసైడ్స్ సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నిర్మూలిస్తాయి.