కొన్ని చిట్కాలు పాటిస్తే మొటిమలు రాకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. చెమట పట్టినప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. లేదా స్నానం చేయాలి. రసాయనాలతో కూడిన సౌందర్య ఉత్పత్తులు, సాధనాలకు దూరంగా ఉండాలి. బెడ్ షీట్స్, దిండు కవర్లను మార్చుతూ ఉండాలి. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఉతుక్కోవడం మంచిది. ముఖాన్ని చేతులతో పదే పదే తాకొద్దు. ఎందుకంటే చేతులతో ముఖాన్ని తాకితే బ్యాక్టీరియా ముఖం పైకి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసం రాత్రిపూట సుమారు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలి.