అనకాపల్లి మండలంలోని బవులవాడ గ్రామం మీదుగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 900 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నామని రూరల్ ఎస్‌ఐ సిహెచ్ నర్సింగరావు గురువారం తెలిపారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెల్లవారుజామున ఈ బియ్యాన్ని పట్టుకుని తమకు అప్పగించి ఫిర్యాదు చేశారన్నారు. ఈ మేరకు అనకాపల్లికి చెందిన విశ్వేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa