పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ పెద్దకడబూరు టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ. పేదవారి నడ్డి విరిచే ఈ ప్రభుత్వ వైఖరి నచించాలని, ఆంధ్రప్రదేశ్ లో దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిన వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 5 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారన్నారు. నిత్యావసర వస్తువులు ధరలు బాదుడే బాదుడే అంటూ పెంచుతున్న ఈ ప్రభుత్వం మనకు అవసరమా అంటూ ప్రజలను ప్రశ్నించారు. అనధికార విద్యుత్ కోతలు వల్ల ప్రజలు చిన్న పిల్లలు రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతున్నారని, ఈ ప్రభుత్వంలో పెరిగిన విద్యుత్ చార్జిలతో ప్రజలకు చివరకు మిగిలేది విసిన కర్ర లాంతరు, కొవ్వొత్తులు అనే అన్నారు. మడమ తిప్పని మాట తప్పనని చెప్పిన మీరు ఇప్పుడు చేస్తుంది ఏంటి అని ప్రశ్నించారు. 2018 చంద్రబాబు ప్రభుత్వం ఉన్నంతవరకు ఎలాంటి కరెంట్ ఇబ్బందులు లేకుండా ఉండేది. కానీ జగన్ వచ్చిన తర్వాత విసనకర్ర, లాంతర్, కొవ్వొత్తి, ఇన్వేటర్లకు డిమాండ్ చాలా పెరిగిందని చమత్కరించారు. అధిక చార్జీలను వినియోగదారులు చెల్లించలేకపోతున్నారని. విద్యుత్ మోటర్లు ఏర్పాటు చేయాలని రైతులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యుత్ కోతలు లేకుండా చేసి చార్జీలు తగ్గించడానికి చంద్రబాబు కృషి చేస్తారని, అప్పటి వరకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ధర్నాలు చేస్తూనే ఉంటామని అన్నారు. కార్యక్రమంలో బసలదొడ్డి ఈరన్న, సీనియర్ నాయకులు ఏసేపు, మల్లికార్జున, మీసేవ ఆంజనేయులు, బాషా తదితరులు పాల్గొన్నారు.