తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణి అరెస్ట్‌ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదికగా అయన స్పందిస్తూ... తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక... బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు! అంటూ చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తపరిచారు.